TG: నిపుణులతో చర్చించి కాళేశ్వరం మరమ్మతులపై దృష్టి పెట్టామని సీఎం రేవంత్ తెలిపారు. నెల రోజుల ముందే తాము ఇక్కడికి రావాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. అతితెలివితో కావాలని బీఆర్ఎస్ రాజకీయ సభ పెట్టుకుందని మండిపడ్డారు. కేసీఆర్, హరీష్ రావులను జైల్లో పెడతామని బీజేపీ చెప్పిందని గుర్తు చేశారు. రెండు సార్లు లేఖలు రాసినా సీబీఐ విచారణపై కేంద్రం స్పందించలేదని చెప్పారు.