BDK : గిరిజన సంక్షేమ గురుకుల విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి గతేడాది కంటే మెరుగైన ఉత్తీర్ణత నమోదైనట్లు ITDA PO బి. రాహుల్ వెల్లడించారు. ప్రథమ సంవత్సరంలో 81.76%(గతేడాది 73.83%), ద్వితీయ సంవత్సరంలో 90.44%(గతేడాది 83.86%) ఉత్తీర్ణత సాధించి విద్యార్థులు సత్తా చాటారని ఆయన తెలిపారు.