నారాయణపేట జిల్లా మక్తల్ మండలం ఊట్కూరు గురుకుల కళాశాల విద్యార్థిని కవిత ఇంటర్ ఫలితాల్లో 971 మార్కులతో కాలేజ్ టాపర్గా నిలిచింది. చిన్నతనంలోనే తల్లిని, ఇటీవల తండ్రిని కోల్పోయినా.. మొక్కవోని ధైర్యంతో చదివి ఈ విజయం సాధించింది. కవిత పట్టుదలను చూసి కళాశాల అధ్యాపక బృందం ఆమెను ప్రత్యేకంగా అభినందించారు.