అసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ సముదాయంలో నీతి ఆయోగ్ కార్యక్రమంలో భాగంగా సోమవారం నూతన అంబులెన్స్ జిల్లా కలెక్టర్ హరిత, నీతి అయోగ్ అధికారితో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు తక్షణ వైద్య సేవలు అందించేందుకు ఈ అంబులెన్స్ ఉపయోగపడుతుందని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడం లక్ష్యమని పేర్కొన్నారు.