MHBD: మరిపెడ మండల కేంద్రంలో BR అంబేద్కర్ విగ్రహాన్ని నాలుగు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేశారు. అయితే నాలుగేండ్లు గడుస్తున్న ఆవిష్కరణకు నోచుకోలేదు. ఇప్పటికి విగ్రహవిష్కరణ ఎందుకు జరగలేదనే విషయంపై స్పష్టత లేదు. ఈ క్రమంలో రేపు ఆయన జయంతి సందర్భంగానైనా విగ్రహాన్ని ఆవిష్కరించాలని స్థానికలు కోరుతున్నారు.