MNCL: భీమిని మండల కేంద్రం రైతువేదికలో గురువారం విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు బెల్లంపల్లి DE రాజేషం, ADE రవికుమార్, నెన్నెల AE రాజన్న సంయుక్త ప్రకటనలో తెలిపారు. నెన్నెల, భీమిని, కన్నెపల్లి, వేమన పల్లి మండలాలకు చెందిన విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.