TG: రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఉ.9 నుంచే భానుడు భగభగమంటున్నాడు. రేపటి నుంచి ఎండలు మరింత ఠారెత్తించనున్నాయి. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. రేపు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, ఖమ్మం జిల్లాల్లో వడగాల్పులు వీచే ఛాన్స్ ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.