TG: విద్యార్థులు డిగ్రీ చదువుతూనే అప్రెంటిస్‌షిప్‌తో ఉద్యోగాలు తెచ్చుకునేలా విద్యాశాఖ మార్పులు చేస్తోంది. ఇందుకోసం అప్రెంటిస్‌షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్‌ను విస్తరిస్తోంది. 2026-27 నుంచి కొత్తగా 11 కోర్సులను ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే 15 ఉండగా, ఆ సంఖ్య 26కు చేరనుంది. డెయిరీ, ఫిషరీస్, యానిమేషన్, ఫుడ్ టెక్నాలజీ, ఈ మొబిలిటీ, MLT తదితర కోర్సులను చేర్చారు.