MBNR: జిల్లాలో ఈ నెల 30 వరకు ఉచిత సన్నబియ్యం పంపిణీ కొనసాగుతుందని పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్ తెలిపారు. జిల్లాలోని 506 దుకాణాల ద్వారా పంపిణీ జరుగుతుండగా.. ఇప్పటివరకు 61% మంది (1.71 లక్షల మంది) బియ్యం తీసుకున్నట్లు పేర్కొన్నారు. మిగిలిన కార్డుదారులు ఈ నెలాఖరులోపు రేషన్ తీసుకోవాలని ఆయన సూచించారు.