PDPL: ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసే వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు హెచ్చరించారు. మంగళవారం ఆయన మంథనిలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొని మాట్లాడారు. మే నెలలో రెండవ విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఎవరికీ డబ్బులు ఇవ్వవద్దని, ఇళ్ల పురోగతి ఆధారంగా బిల్లులు చెల్లించబడతాయని తెలిపారు.