MDK: తూప్రాన్ మండలం నాగులపల్లి శివారులో విషాదం చోటుచేసుకుంది. నాచురల్ సీడ్ కంపెనీలో పనిచేస్తున్న బీహార్‌కు చెందిన కూలీ కుందన్ మురుము (19) పాము కాటుతో మృతి చెందినట్లు ఎస్సై యాదగిరి తెలిపారు. శనివారం రాత్రిషెడ్డులో నిద్రపోతున్న సమయంలో అతడిని పాము కరిచింది. ఆదివారం గమనించిన తోటి కూలీలు వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.