HYD: ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అయ్యే పేద విద్యార్థులకు మల్కాజిగిరి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కొట్టే ఏడుకొండలు అండగా నిలుస్తున్నారు. 11 ఏళ్లుగా లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగ అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్ అందిస్తూ సేవ చేస్తున్నారు. 2015లో 32 మందితో ప్రారంభమైన ఈ ప్రయాణం ఇప్పటికీ 10 లక్షల మందికి విస్తరించింది. తన జీతంలో సుమారు 40 శాతం ఖర్చు చేస్తున్నట్లు ఏడుకొండలు తెలిపారు.