కోనసీమ: ముమ్మిడివరం పదో మైలురాయి సెంటర్లో ఆదివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు మృతి చెందాడు. అతను కొత్తపేట మండలం వాడపాలెం గ్రామానికి చెందిన పెట్టా బాబిగా పోలీసులు గుర్తించారు. బైక్పై వెళుతూ ఎదురుగా ఉన్న కారును ఢీకొట్టగా బాబి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు.