KRNL: ఆలూరులో నిర్మాణ దశలో ఉన్న అన్నా క్యాంటీన్ భవనాన్ని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి ఇవాళ సందర్శించారు. భవన నిర్మాణ నాణ్యతతో పాటు వంటగది, భోజనశాల సౌకర్యాలను పరిశీలించి, నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. పేదలకు తక్కువ ధరకే నాణ్యమైన భోజనం అందించే అన్నా క్యాంటీన్ ఆలూరు ప్రజలకు ఉపయోగపడుతుందన్నారు.