అన్నమయ్య: ఎస్పీ ధీరజ్ క్రికెట్ బెట్టింగ్‌పై ప్రజలను అప్రమత్తం చేశారు. ఐపీఎల్ సీజన్లో సరదాగా మొదలయ్యే బెట్టింగ్ వ్యసనంగా మారి యువతను అప్పులు, నేరాల వైపు నెడుతుందని హెచ్చరించారు. సెల్ఫోన్ల ద్వారా జరుగుతున్న ఈ అక్రమ కార్యకలాపాలపై సైబర్ క్రైమ్ పోలీసులు నిఘా ఉంచారని తెలిపారు. బెట్టింగ్‌లో పాల్గొంటే క్రిమినల్ కేసులు నమోదై భవిష్యత్తు దెబ్బతింటుందని స్పష్టం చేశారు.