NZB: సాలూరు మండలం హున్సా గ్రామపంచాయతిలో విద్యావేత్త, ప్రముఖ సంఘసంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలను సర్పంచ్ మర్కల్ శివకుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ మాట్లాడుతూ.. వెనుకబడిన వర్గాల సంక్షేమం, మహిళా విద్య కోసం పూలే చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ముర్గె శంకర్, ముద్ద ఈర్వంత్ రావు, దేశాయి శంకర్ పాల్గొన్నారు.