HNK: నడికూడ మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో మహాత్మా జ్యోతిరావుపూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ.. సమాజంలో కులవివక్ష, అంటరానితనంపై పోరాటం చేసి, వెనకబడిన బడుగు, బలహీన వర్గాలకు హక్కులు, మహిళలకు విద్యావకాశం కల్పించిన గొప్ప సంఘసంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే అని అన్నారు.