GDWL: ఈ నెల 15 నుంచి 17 వరకు హైదరాబాద్లో నిర్వహించనున్న ప్రజానాట్య మండలి రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని గద్వాల జిల్లా అధ్యక్షుడు అలీ అక్బర్ పిలుపునిచ్చారు. శుక్రవారం అలంపూర్ మండలంలో సభలకు సంబంధించిన కరపత్రాలను ఆయన విడుదల చేశారు. జిల్లాలోని కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఈదన్న, రాజు తదితరులు పాల్గొన్నారు.