చెన్నై వేదికగా ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్‌తో CSK తలపడనుంది. ఈ మ్యాచ్‌లో CSK స్టార్ ప్లేయర్ డేవాల్డ్ బ్రెవిస్ బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. గాయం కారణంగా గత మూడు మ్యాచ్‌లకు దూరమైన అతడు, ప్రస్తుతం పూర్తి ఫిట్నెస్ సాధించాడు. మరోవైపు, ఈ మ్యాచ్‌లోనూ ధోనీ ఆడటంపై సందిగ్ధత కొనసాగుతోంది. గాయం నుంచి కోలుకోవడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని సమాచారం.