కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇల్చీపూర్ సరస్వతీ మహాక్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం అమ్మవారికి ఫల పంచామృత అభిషేకం, హారతి, మంత్రపుష్పం మొదలగు పూజలు చేసి అమ్మవారిని సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. దర్శనానికి వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసినట్లు ఆలయ అర్చకులు దత్తాత్రేయ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు పాల్గొన్నారు.