KMR: జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర శుక్రవారం బాన్సువాడ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు, పనితీరును పరిశీలించారు. బాధితుల పట్ల మానవీయంగా వ్యవహరించాలని సూచించారు. నేరాల నివారణకు రాత్రి గస్తీ, నిఘా ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజల విశ్వాసమే లక్ష్యంగా బాధ్యతాయుతంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.