WNP: వచ్చే విద్యా సంవత్సరం (2026-27) నుంచి ఇంటర్లో ACE (అకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్) గ్రూపును ప్రవేశ పెడుతున్నట్లు DIEO ఎర్ర అంజయ్య తెలిపారు. కోర్సు నిర్వహించాలనుకునే కళాశాలలు వెంటనే ఇంటర్ బోర్డుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కొత్త కోర్సుపై విద్యార్థులకు విస్తృత ప్రచారం కల్పించాలని ప్రిన్సిపాల్లను ఆదేశించారు.