AP: రాష్ట్రంలోని 352 KGBVల్లో చేరేందుకు దరఖాస్తు గడువును మరోసారి పొడిగిస్తున్నట్లు SPD శ్రీనివాసరావు తెలిపారు. నిన్నటితో గడువు ముగియగా పేరెంట్స్ వినతి మేరకు ఈనెల 20 వరకు పొడిగించామన్నారు. 6, 11 తరగతుల్లో ప్రవేశాలతో పాటు మిగతా తరగతుల్లో మిగిలిపోయిన అడ్మిషన్లకు అప్లికేషన్లు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 32,079 సీట్లకు గానూ 69,362 దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు.