AP: కాజీపేట విద్యార్థిని హత్య కేసులో నిందితుడు వెంకటేష్పై పోలీసులు కాల్పులు జరిపారు. మైదుకూరు నుంచి తరలిస్తుండగా బాసాపురం చెక్పోస్ట్ వద్ద పారిపోయేందుకు ప్రయత్నించడంతో పోలీసులు ఫైరింగ్ చేశారు. ఈ ఘటనలో నిందితుడి కాలికి తీవ్ర గాయమై, పరిస్థితి విషమంగా ఉంది. నిందితుడిని తమకు అప్పగించాలని లేదా బహిరంగంగా ఉరిశిక్ష వేయాలంటూ గ్రామస్థులు హైవేపై భారీ ధర్నా చేపట్టారు.