MHBD: మరిపెడ మండలంలో ఘనంగా నిర్వహించనున్న మాకుల జాతర ఏర్పాట్లను ఆదివారం ఎస్సై వీరభద్ర రావు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలను ఆలయ అధికారులకు వివరించారు. సెక్యూరిటీ పరంగా భారీకేడ్స్ ఏర్పాటు చేసే స్థలాలను పరిశీలించారు.