SKLM: రణస్థలం మండలం పరిధిలోని రావాడ గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు కేంద్ర ప్రభుత్వ సంస్థలో SSC పరీక్షలో ఉద్యోగాలు సాధించారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో లంక వెంకటేశ్ ఆదాయపు పన్ను శాఖ కార్యాలయ సూపరింటెండెంట్‌గా, గొర్లె అప్పలనాయుడు జూనియర్ స్టాటిస్టికల్ అధికారిగా ఎంపికయ్యారు. ఇరువురి కుటుంబాల తల్లిదండ్రులు వ్యవసాయ చేస్తుంటారు.