TG: ఇంటర్ వార్షిక ఫలితాలు విడుదలయ్యాయి. ఫస్టియర్లో 66.20 శాతం, సెకండియర్లో 70.58 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో మేడ్చల్ జిల్లా 82.73 శాతంతో టాప్లో నిలిచింది. 58.69 శాతంతో రాజన్న సిరిసిల్ల జిల్లా చివరి స్థానంలో ఉంది. బాలికలు 74.40%, బాలురు 57.69% ఉత్తీర్ణత సాధించారు. మే 13 సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది.