గుంటూరు: ఎండల్లో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు ఉపశమనం కలిగించేలా విశ్రాంత ప్రిన్సిపల్ నేతి చలపతి 40 సోలార్ హెల్మెట్లను అందించారు. శివాజీ చౌక్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సీఐలు మల్లికార్జునరావు, రాములు నాయక్ వీటిని సిబ్బందికి పంపిణీ చేశారు. ఈ హెల్మెట్లు ఎండ తీవ్రతను తగ్గించడంలో సహాయపడతాయని అధికారులు తెలిపారు.