AP: టీడీపీ, జనసేన పార్టీ వాళ్లు తనను విపరీతంగా నిందిస్తున్నారని జై భీమ్ రావ్ భారత్ పార్టీ అధినేత జడ శ్రవణ్ స్పష్టం చేశారు. రెండేళ్లలోనే కూటమి ప్రభుత్వం రూ.3.56 లక్షల కోట్ల అప్పు చేసిందని, జగన్ హయాంలో గగ్గోలు పెట్టిన మీడియా ఇప్పుడు ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. మావిగన్ ప్రతిపాదనను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో కూటమి ప్రభుత్వం ప్రజలకు చెప్పాలన్నారు.