VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల ఏర్పాట్లపై వీసీ ఆచార్య జి.పి. రాజశేఖర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వేదిక, పార్కింగ్, గ్రీన్రూమ్లు, గ్యాలరీల ఏర్పాట్లపై చర్చించి, ప్రోటోకాల్ ప్రకారం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. అధికారులు తమ పనులకు గడువులు నిర్ణయించి సమయానికి పూర్తి చేయాలని, రోజువారీ పురోగతిని సమీక్షించాలన్నారు.