TG: ఒకప్పుడు తెలంగాణ చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉండేదని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. తాము ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటికీ ఏమీ చేయలేని, మాట్లాడలేని పరిస్థితి అని తెలిపారు. అసెంబ్లీలో తెలంగాణ అనే పదాన్నే నిషేధించిన రోజులు ఉండేవన్నారు. ఆనాడు విద్యుత్ ఛార్జీలు పెంచితే రైతులు ఆందోళన చేస్తే.. వారిపై కాల్పులు జరిపారని గుర్తుచేశారు. అప్పుడే రాష్ట్రం కోసం కొట్లాడాలని అనుకున్నామన్నారు.