AP: విజయనగరం జిల్లా పీరిడి గ్రామానికి చెందిన సింగిరెడ్డి సాయి శ్రీహరికృష్ణ అమెరికాలో మృతిచెందాడు. ఇంజినీరింగ్ పూర్తి చేసిన హరికృష్ణ అమెరికాలో ఎమ్మెస్ కోసం వెళ్లాడు. చదువు పూర్తి కాగానే 6 నెలల కిందట ఉద్యోగం కూడా సంపాదించాడు. నిన్న తన పుట్టినరోజు సందర్భంగా స్నేహితులతో కలిసి ఆనందంగా గడిపాడు. సాయంత్రం చెరువులో స్నానానికి దిగి మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.