NLG: జిల్లా వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ రెండో వారంలోనే భానుడు తన ప్రతాపం చూపిస్తుండటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. మాడుగులపల్లి(M)లో అత్యధికంగా 41.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 11 గంటలకే ఎండ తీవ్రత ముదురుతుండటంతో జనం బయటకు రావడానికి జంకుతున్నారు. మధ్యాహ్నం వేళ క్లాక్ టవర్, రోడ్డులు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.