MDCL: విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఆకస్మిక తనిఖీల్లో పరిపాలనా లోపాలు బయటపడ్డాయి. పలు ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బంది గైర్హాజరు, నిబంధనల ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి. ఉప్పల్ ఆర్టీవో కార్యాలయంలో రూ.180.65 కోట్ల పన్ను బకాయిలు పెండింగ్లో ఉన్నట్లు గుర్తించారు. పరిశ్రమల్లో భద్రతా అనుమతులు లేకుండా కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.