HYD: హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ పోలీసులు వీకెండ్ ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించి, మద్యం సేవించి వాహనాలు నడిపిన 990 మందిపై కేసులు నమోదు చేశారు. రోడ్డు భద్రత ఉల్లంఘనలపై జీరో టాలరెన్స్ విధానాన్ని కఠినంగా అమలు చేస్తున్నారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.