KMM: బోనకల్ మండలం లక్ష్మీపురం సొసైటీ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ప్రారంభించారు. మధిర వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్ బండారు నరసింహారావు ఈ కేంద్రాన్ని ప్రారంభించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యమని తెలిపారు. లక్ష్మీపురం, గోవిందాపురం, గార్లపాడు, తూటికుంట్ల గ్రామ రైతులు ఈ కేంద్రాన్ని వినియోగించుకోవచ్చన్నారు.