SDPT: చేర్యాల మండలం దానంపల్లి గ్రామంలో ఆదివారం నిర్వహించిన దుర్గమ్మ పండుగ, బొడ్రాయి ప్రతిష్ఠాపన వేడుకల్లో ఎమ్మెల్యే పల్లా రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి అనుగ్రహంతో అందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, గ్రామం మరింత అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు.