SRD: ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు అద్భుత ప్రతిభ కనబరిచి తమ ఆధిపత్యాన్ని చాటారు. సెకండియర్లో 78.01% ఉత్తీర్ణతతో బాలికలు ముందంజలో ఉండగా, బాలురు 61.35% సాధించారు. అలాగే ఫస్టియర్లో బాలికలు 70.82%, బాలురు 49.44% ఉత్తీర్ణత పొందారని డీఐఈవో మాధవి తెలిపారు. ప్రతి విభాగంలోనూ అబ్బాయిల కంటే అమ్మాయిలే మెరుగైన ప్రదర్శన కనబరిచి జిల్లాలో టాపర్లుగా నిలిచారు.