లక్నో విసిరిన 165 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు గుజరాత్ నిలకడగా ఆడుతోంది. పవర్ ప్లే ముగిసేసమయానికి సాయి సుదర్శన్(15) వికెట్ మాత్రమే కోల్పోయి 52 పరుగులు చేసింది. అంతకుముందు ఇదే సమయానికి లక్నో 60/2 స్కోర్ చేసింది. గుజరాత్ తరఫున ప్రస్తుతం క్రీజులో బట్లర్(6), గిల్(31) ఉన్నారు. లక్నో బౌలర్ దిగ్వేష్ సింగ్ ఒక వికెట్ తీసుకున్నాడు.