NLG: దేవరకొండ ఏబీవీపీ నగర శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కో-కన్వీనర్ యలమల గోపీచంద్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల విద్యార్థులను విద్యకు బాసటగా నిలుస్తూ.. 14 లక్షల మంది విద్యార్థులకు అభయంగా నిలిచిన స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ రూ.10 వేల కోట్ల బకాయిలను విడుదల చేయాలన్నారు.