TG: రాష్ట్రంలో ‘దోచుకో.. దాచుకో’ ప్రభుత్వం నడుస్తోందని మాజీమంత్రి కేటీఆర్ విమర్శించారు. సీఎం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ అదే పని మీద ఉన్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అటకెక్కించిందని దుయ్యబట్టారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ పేరిట సింగరేణి సంపదను దోచుకుంటున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు.