GNTR: ఫిరంగిపురం మండలంలో మొక్కజొన్న, జొన్న, శనగ, మినుము, పెసర తదితర పంటలు కోత దశకు చేరుకున్నప్పటికీ ఇప్పటివరకు ఎక్కడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం పట్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని రైతు సంఘాల నాయకులు తెలిపారు. సోమవారం ఫిరంగిపురంలోని తహసీల్దార్ కార్యాలయంలో గ్రీవెన్స్‌లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేశారు.