రాత్రి RCB చేతిలో ముంబై 18 రన్స్ తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై మ్యాచ్ అనంతరం MI కెప్టెన్ హార్దిక్ మాట్లాడుతూ.. తమ బ్యాటింగ్, బౌలింగ్ ఏమాత్రం బాగోలేదని, గత 3 మ్యాచ్‌ల్లోనూ వ్యూహాలు బెడిసి కొట్టాయన్నాడు. ప్రతిసారీ ఆరంభంలోనే వెనకబడిపోతున్నామని, మ్యాచ్ అంతా పుంజుకోవడానికి సరిపోతోందన్నాడు. రానున్న మ్యాచ్‌ల్లో ఈ పరిస్థితిని అధిగమిస్తామని చెప్పుకొచ్చాడు.