AP: రాష్ట్ర మంత్రుల బృందం ఈ నెల 21 నుంచి 27 వరకు సింగపూర్లో పర్యటించనుంది. స్వర్ణాంధ్ర 2027 విజన్ అమలులో భాగంగా సుపరిపాలన, ఆర్థికాభివృద్ధి, ప్రజా సేవలపై నైపుణ్యాలు పెంచుకునేందుకు మత్రులు, అధికారులు అక్కడ శిక్షణ తీసుకోనున్నారు. ఆపై రాష్ట్రానికి వచ్చి ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులకు ఆయా నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చే లీడ్ ట్రైనర్లుగా వ్యవహరించనున్నారు.