TG: జగిత్యాలలో ఈనెల 20న జరగనున్న కేసీఆర్ ‘ప్రజా ఆశీర్వాద సభ’ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు బయలుదేరి వెళ్లారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పార్టీ కీలక నాయకులతో వారు సమావేశమై, సభ నిర్వహణపై దిశానిర్ధేశం చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు జగిత్యాలలో కేటీఆర్, హరీష్ రావు మీడియా సమావేశంలో పాల్గొంటారు.