BDK: పినపాక మండల కేంద్రంలో ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ నాయకులు శనివారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆలెం కోటి మాట్లాడుతూ.. గుట్ట మల్లారం రెవెన్యూ పరిధిలోని సర్వేనెంబర్ 38, 39, 49 చెరువులు కుంటలు నాళాలు కబ్జాకు గురి అయ్యాయని తెలిపారు. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు స్పందించి అక్రమార్కులను శిక్షించాలని డిమాండ్ చేశారు.