W.G: సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు తాడేపల్లిగూడెంకు మరో 15రోజుల్లో వస్తుందని కేంద్రమంత్రి భూపతిరాజు వర్మ ప్రకటించారు. సికింద్రాబాద్ డివిజన్ రైల్వే అధికారులకు కేంద్ర రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసిందని ఆయన స్పష్టం చేశారు. ఈమేరకు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌కు ఫోన్ ద్వారా సమాచారమిచ్చి వీడియో షేర్ చేసినట్లు వెల్లడించారు.