AP: హైదరాబాద్కు చెందిన వర్మ స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తిరుమల TTDకి రూ.1,01,01,116 విరాళంగా అందించింది. తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు ఈ విరాళం ఇస్తున్నట్లు ఆ సంస్థ ఎండీ అల్లూరి వర్మ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.