TG: తెలంగాణలో దాగి ఉన్న అందమైన హిల్ స్టేషన్లలో ‘గొట్టం గుట్ట’ ఒకటి. దీనిని స్థానికులు తెలంగాణ ఊటీగా పిలుస్తారు. సరస్సులు, పచ్చని అడవులు, కొండల మధ్య ఉన్న ఈ ప్రదేశం ప్రకృతి ప్రేమికులను ఎంతో ఆకర్షిస్తుంది. గొట్టాం గుట్ట హైదరాబాద్కు సుమారు 135 కిలోమీటర్ల దూరంలో, తెలంగాణ-కర్ణాటక సరిహద్దులో ఉంది. ఇది ఒక సాహసభరిత అనుభవం.