VKB: ఇంటర్ ఫలితాల్లో బొంరాస్పేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభకనబరిచారు. ద్వితీయ సంవత్సరంలో 60 శాతం, ప్రథమ సంవత్సరంలో 37 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు ప్రిన్సిపల్ రోజా రాణి తెలిపారు. సుస్మిత (MPC), భార్గవి, పల్లవి (BIPC), రేఖశ్రీ (CEC), హసన్ (MLT), కీర్తి (ఎంపీ హెచ్ఐడబ్ల్యూ) అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ప్రతిభచాటిన వారిని కళాశాల బృందం అభినందించారు.